KCR:కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండి

25
- Advertisement -

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు సీఎం కేసీఆర్.ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మీని గెలిపించాలని కోరారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తితో పాటు పార్టీ గురించి ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటు అని ఆషామాషిగా వేయొద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ముందుకు వెళ్తే తెలంగాణ వచ్చిందన్నారు. ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి కళ్ల ముందే ఉందన్నారు.తెలంగాణ రాకపోతే ఆసిఫాబాద్ జిల్లా కాకపోయేదన్నారు. కలలో కూడా ఆసిఫాబాద్ జిల్లా అవుతుందని అనుకోలేదని కానీ దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్ల 58 ఏళ్లు గోస పడ్డామని మళ్లీ ఆ తప్పు చేయవద్దన్నారు.

ఆసిఫాబాద్‌కు మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు. కొమురంభీం పేరుతోనే ఈ జిల్లా వచ్చిందన్నారు. కొమురం భీం స్మారక చిహ్నం నిర్మించామన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువులు,వలసలు,సాగు నీరు లేక ఇబ్బందులు పడ్డామన్నారు. వలసలకు కేరాఫ్‌గా మహబూబ్ నగర్ ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ లో 47 వేల ఎకరాల పోడు పట్టాలు ఇచ్చామన్నారు. వారికి రైతు బంధుతో పాటు రైతు బీమా కూడా ఇచ్చామన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు బంధు దుబారా అని మాట్లాడుతున్నారని అలాంటి వారికి బుద్ది చెప్పాలన్నారు. ధరణితో రైతుల భూములకు రక్షణ ఏర్పడిందన్నారు. రైతు భీమాతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తాం అంటే రైతు బంధు ఎలా వస్తుందో ఆలోచించాలన్నారు. ధరణి తీసెస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందన్నారు. ధరణి వద్దన్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. వచ్చే సంవత్సరం నుండి సన్నబియ్యమే రేషన్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు.

Also Read:CM KCR:కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం

- Advertisement -