మహిళల పేరు మీదే పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. ఆసిఫాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించి, పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఈ భూములకు సంబంధించి గతంలో గిరిజనులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పారు.
ఇప్పటివరకు గిరిజన గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పన దాదాపు పూర్తయ్యిందని, ఇకపై అన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనుల పొలాలకు కూడా త్రీఫేజ్ కరెంటు ఇస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 51 మంది రైతులకు నాలుగు లక్షల 50 వేల ఎకరాల పోడు భూమిని పట్టాలు ఇచ్చి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:Guava:జామకాయతో ఆరోగ్యం
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తాను ఏ పిలుపునిచ్చినా ఉద్యోగులు శక్తివంచన లేకుండా తమవంతు కృషిచేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. అందరి సహకారం వల్లే నాడు స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మందికి పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
Also Read:పొలిటికల్ ఎంట్రీపై రాయుడు..