మళ్లీ మాదే అధికారం.. ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతే

213
trs elections
- Advertisement -

తెలంగాణలో మళ్లీ రాబోయేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో 110 అసెంబ్లీ సీట్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించబోతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇవాళ నల్గొండలోని టీఆర్‌ఎస్‌ ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తాను చేయించిన సర్వేలో 119 స్ధానాల్లో టీఆర్‌ఎస్‌, 7 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవబోతున్నాయని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ 12 స్ధానాలకు గాను 12 స్ధానాలను గెలుచుకని క్లీన్‌స్విప్‌ చేయబోతోందని సీఎం పేర్కొన్నారు.

ప్రజలు ప్రతిపక్షాలను నమ్మబోరని, మహాకూటమి ఓ దగాకూటమని, మరొకసారి ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించబోతున్నారని ఇది సత్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ డిపాజిట్లు గల్లంతవుతాయని, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల గోసిలు ఊడబోతున్నాయని ఎద్దేవా చేశారు. ఉద్యమాలకు, పోరాటాలకు నెలవైన తెలంగాణలో చైతన్యవంతులైన ప్రజలు ఉన్నారని, విజ్ఞతతో ఆలోచించి ఓటువేస్తారని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ పార్టీని బలపరుస్తారని, తిరిగి మళ్లీ టీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌. నల్గొండలో సీఎం కేసీఆర్‌ హుషారెత్తించే స్పీచ్‌తో నాయకులు, కార్యకర్తలో జోష్ ను నింపారు.

- Advertisement -