హరీష్ నేను..అన్నదమ్ముల్లా పెరిగాం:కేటీఆర్

234
ktr harish
- Advertisement -

తమ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదని మరోసారి స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్‌తో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సమావేశంలో ఇరువురు ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించారు.

హరీశ్‌రావు, తాను సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని చెప్పారు. తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని…ఉద్యమ కాలం నుంచి తెలంగాణ కోసమే పనిచేసిన తామిద్దరం ఒకే మంత్రి వర్గంలో పనిచేసే అవకాశం లభించడం ప్రజలిచ్చిన సువర్ణవకాశం అన్నారు. సిరిసిల్ల కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.

మరో 15 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు. కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీశ్‌రావు పరుగెత్తిస్తున్నారని పొగిడారు.హరీశ్‌రావు పనితీరును తమ నియోజకవర్గ అభివృద్ధికి ఆదర్శంగా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

- Advertisement -