- Advertisement -
తెలంగాణలో చారిత్రక రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
వీఆర్‌వోలను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు..ప్రజలకు మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకోస్తున్నామని తెలిపారు. వీఆర్వోల అర్హతలను బట్టి ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో వీఆర్‌వోలను భర్తీ చేస్తామన్నారు.
రెవెన్యూ సంస్కరణల వల్ల ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని సీఎం స్పష్టం చేశారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గత మూడేళ్ల నుంచి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు.ధరణి వెబ్ సైట్ అన్నింటికి ఆయువు పట్టు అన్నారు.
- Advertisement -