వలస కార్మికులకు అండగా ప్రభుత్వం

251
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన తన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను అదేశించారు.

వలస కార్మికులు తమ సొంత ప్రాంతానికి పోవడానికి అవసరమైన రైళ్లు సమకూర్చాలని సిఎస్ ను ఆదేశించారు. రైళ్లు లేని ప్రాంతాల నుంచి అవసరమైతే బస్సుల ద్వారా తరలించాలని సూచించారు.

తమ సొంత ప్రాంతానికి వెళ్లాలని కోరుకునే వలస కార్మికులెవరు నడిచి పోవాలనే ఆలోచన చేయవద్దని, తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని తమ సొంత ప్రాంతాలకు తరలిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

- Advertisement -