సీఎం సహాయనిధికి భారీ విరాళాలు..

299
indrakaran reddy
- Advertisement -

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, సంస్థలు గురువారం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు ప్రకటించాయి.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ. 26 లక్షల 8 వేలు, పడిగెల కేదర్ నాథ్ రూ. 9 లక్షలు, లక్కిడి జగన్ మోహన్ రావు రూ. 6 లక్షలు, అన్నపూర్ణ కన్స్ట్రక్షన్స్ సాగర్ రావు రూ. 5 లక్షలు, జాన్ డీర్ ట్రాక్టర్ షోరూమ్ నార్లపురం రవీందర్ రూ. 5 లక్షలు, మహేంద్ర ట్రాక్టర్ షోరూం జ్ఞానేశ్వర్ రూ. 2 లక్షలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ. 5 లక్షలు, కిరాణా అసోసియేషన్ రూ. 6 లక్షల 11 వేలు, పైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల అసోసియేషన్ రూ.2 లక్షల 50 వేలు, వైష్ణొవి కన్స్ట్రక్షన్స్ అల్లోల మురళిధర్ రెడ్డి రూ. 5 లక్షలు అందించారు.

వైన్స్ సిండికేట్ అల్లోల తిరుపతి రెడ్డి రూ. 4 లక్షల 50 వేలు, గోల్డ్ స్మిత్స్, గోల్డ్ షాప్స్ రూ. 2 లక్షలు, స్టోన్ క్రషర్స్ అల్లోల సురేందర్ రెడ్డి రూ. 2 లక్షలు, స్టీల్, సిమెంట్ ఏజెంసీస్ రూ. 1 లక్ష, స్టీల్, బ్రాస్ మర్చెంట్స్ రూ. 1 లక్ష, గ్యాస్ ఏజెంసీస్ రూ. 75 వేలు, మార్బుల్ షాప్స్ అసోసియేషన్ రూ. 30 వేలు, సానిటరి షాప్స్ అసోసియేషన్ రూ. 1 లక్షా, శ్రీనివాస్ కాంట్రాక్టర్ రూ. 50 వేలు, గౌరిశంకర్ కాంట్రాక్టర్ రూ. 5 లక్షలు, తెలంగాణ అర్చక సంఘం రూ. 3 లక్షల 50 వేలు, కె. రామకిషన్ రెడ్డి రూ. 15 వేలు. దీనికి సంబంధించిన చెక్కులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ప్రగతిభవన్ లో అందించారు.

- Advertisement -