KCR:ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లే

67
- Advertisement -

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం అన్నారు సీఎం కేసీఆర్. స్టేషన్ ఘన్‌పూర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…50 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దని..ప్రజలు అంతా ఆలోచించి ఓటు వేయాలన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యం ఎంత సక్కగుందో చెప్పాల్సిన పని లేదని…ఎమర్జెన్సీ సమయంలో అమాచకులను జైలుకు పంపారన్నారు. ఇందిరమ్మ పాలన బాగుంటే వలసలకు ఎందుకు వెళ్లే వారన్నారు. ఇందరమ్మ రాజ్యమంటే ఆకలి, వలసలు,ఎన్‌కౌంటర్లే అన్నారు. ఇందిరమ్మ రాజ్యం సక్కగనే ఉంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారన్నారు.

ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం తెచ్చారన్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులనే కాదు పార్టీలను చూసి ఓటు వేయాలన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో నాకంటే గొప్ప ఉద్యమకారులున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ గోస పడిందన్నారు. అధికారం కోసం బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.

ఎన్నికల రాగానే అబద్దాలు ప్రచారం చేస్తారు ఆలోచించాలన్నారు.స్టేషన్ ఘన్‌పూర్ నుండి వేలాది మంది వలసలు వెళ్లేవారన్నారు. రాష్ట్ర సంపద పెరిగిన కొద్ది పెన్షన్లను పెంచుకుంటున్నాం అన్నారు.10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. పదేళ్లలో స్టేషన్ ఘన్‌పూర్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తున్నామని, సాగునీటితో తెలంగాణ కలకల లాడుతుందన్నారు. చుక్క సత్తయ్య అనే పేరు మోసిన ఒగ్గు కళాకారుడు…నీటి కోసం 58 బోర్లు వేశారని గుర్తు చేశారు. నీటి కోసం ఇంత గోసపడ్డామన్నారు.

లక్షా 10 వేల ఎకరాలకు స్టేషన్ ఘన్‌పూర్‌లో నీళ్లు పారుతున్నాయన్నారు. మల్కపూర్ రిజర్వాయర్ కోసం కడియం శ్రీహరి ఎంతో కృషి చేశారన్నారు. కరెంట్ బాధ పోయిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్ని బాగుచేసుకున్నామన్నారు. దేశంలో రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతులు పండించిన వడ్లను ప్రభుత్వమే కొంటుందన్నారు.

Also Read:Congress:’స్కాం’గ్రెస్.. పెద్ద ప్లానే ఇది!

- Advertisement -