నెల 6న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం అలసత్వాన్ని ఎండగట్టాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. నీటి పారుదల శాఖపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం…..నీటి పారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్రానికి తెలపాల్సిన వివరాలను తీసుకుని రావాలని అధికారులకు సూచించారు.
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్యనైనా, లేదంటే నదీ పరివాహక ప్రాంతాల్లోని మొత్తం రాష్ర్టాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరినట్లు కేసీఆర్ తెలిపారు. ఏడేళ్ల సమయం వచ్చినా ప్రధాన మంత్రికి రాసిన లేఖకు ఈనాటికీ స్పందన లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు.. పలుకు లేదు. అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నారు కానీ కేంద్రం ఏమీ చేయడం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. నిజనిజాలను ఈ సమావేశంలో యావత్ దేశానికి తేటతెల్లం చేయాలన్నారు. రాష్ర్టాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ర్టం ఏర్పడితే వెంటనే ఆ రాష్ర్టానికి నీటిని కేటాయించాలన్నారు.
తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాలి. తెలంగాణ రాష్ర్టం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.