గ్రేటర్‌లో కరోనా కేసులపై సీఎం కేసీఆర్ సమీక్ష..

246
cm kcr
- Advertisement -

గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అప్రమత్తం చేశారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో కేసులు పెరుగకుండా, వ్యాప్తి చెందకుండా చూడాలని ఆదేశించారు. సిఎం గారి ఆదేశాలమేరకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగా రావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్ , వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సిఎం గారు సూచనల మేరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ శాఖల సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎం గారికి నివేదించినట్లు మంత్రి తెలియజేశారు.

ఈ రోజు 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1038 కి చేరుకున్నాయి. మలకపెట్ గంజ్ లో పనిచేస్తున్నపహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది. వీరి కుటుంబాలన్నీటిని ఆసుపత్రిలో ఐసొలేషన్ లో ఉంచామని. గంజ్, పహదీశరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు.

ఈరోజు ముగ్గురు కరోనా మరియు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారు. వీరిలో ..
1 : 48(male) సంవత్సరాల వయసుగల రామంతాపూర్ కి చెందిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయారు. షుగర్, బీపీ, స్థూలకాయం,న్యుమోనియా తో బాధపడుతూ చనిపోయారు.

2 : 76 సంవత్సరాల (male) : వనస్థలిపురం చెందిన వ్యక్తి , గుండె,కిడ్నీ,న్యూమోనియాతో బాధపడుతూ గాంధీ లో చేరిన 24 గంటల్లోనే చనిపోయారు.

3 : 44 (female ) సంవత్సరాల వయసుగల దుర్గానగర్, జియగూడ కి చెందిన వ్యక్తి నిన్న గాంధీ ఆసుపత్రి కి వెంటిలేటర్ మీదనే వచ్చారు. వచ్చిన 6 గంటల్లోనే మరణించారు. ఈమె కూడా బీపీ, షుగర్,న్యుమోనియా తో బాధ పడుతున్నారు.

ఈరోజు 33 మంది కరోనాకు పూర్తి చికిత్స తరువాత, పరీక్షలో రెండు నెగెటివ్ రిపోర్ట్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. ఇందులో 50 సంవత్సరాల వయసుగల డాక్టర్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గాంధీలో 20 రోజుల క్రితం తీవ్ర మైన వ్యాది లక్షణాలతో అడ్మిట్ అయిన డాక్టర్ హైడ్రోక్సి క్లోరోక్వీన్, అజిత్రో మైసిన్ తదితర మందులు అందించి పూర్తిగా నయం చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చికిత్స, పేషంట్లకు అందిస్తున్న సౌకర్యాలపట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషం అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇక్కడ పర్యటిస్తున్న బృందం జరుగుతున్న పరీక్షల తీరు మీద, ల్యాబ్ లు పనిచేస్తున్న విధానం పట్ల, చికిత్స పట్ల హోం శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీమతి సలీల శ్రీవాత్సవ ప్రశంశలు కురిపించారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తు చ తప్పకుండా పాటిస్తున్నారని కేంద్ర బృందమే రిపోర్ట్ పంపిన తరువాత రాజకీయ విమర్శలకు తావు లేదని మంత్రి అన్నారు. గాంధీ, కింగ్ కోటి, గచ్చిబౌలీ, ఫీవర్ హాస్పిటల్స్, లాబ్స్, కంటేనమెంట్ ప్రాంతాలు, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, నైట్ షెల్టర్ లు విస్తృతంగా పర్యటించి అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తూ రిపోర్ట్ పంపించారని కేంద్ర ప్రభుత్వమే తెలియజేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

- Advertisement -