1038కి చేరిన కరోనా కేసులు..

116
corona updates

తెలంగాణలో కరోనా కేసులు 1038కి చేరాయి. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది ఆరోగ్య శాఖ.

కరోనాతో ఇవాళ ముగ్గురు మృతి చెందగా ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 28కి చేరింది. ఇవాళ 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ పాజిటివ్ కేసులు 568 ఉండగా ఇప్పటివరకు 442 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.