దళిత బంధుపై కరీంనగర్‌లో సీఎం రివ్యూ..

56
kcr cm

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కీం అమలుకానుండగా ఇందుకోసం రూ. 2 వేల కోట్లు కేటాయించారు. ఇక దళితబంధు పథకం ఇంటింటి సర్వే ఇవాళ హుజురాబాద్‌లో ప్రారంభంకాగా కరీంనగర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్.

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరయ్యారు. పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

హుజూరాబాద్‌లో నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.2 వేల కోట్లు కలెక్టర్ ఖాతాలో జమచేసింది.