మల్లన్న సాగర్ పనులపై కేసీఆర్‌ సమావేశం..

258
CM KCR
- Advertisement -

మల్లన్న సాగర్ జలాశయం పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ నిర్వాసితులకు ఉపాధి, పునరావాసంపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కల్పించాలని ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, ఈ నెల 11వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సూచించారు. పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు. సీనియర్ అధికారులతో మాట్లాడారు.

CM KCR

నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో, అత్యంత మానవత్వంతో వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ కోర్టులు తరచూ జోక్యం చేసుకునే పరిస్థితులు రావడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రియను వెంటనే ముగించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషికి సూచించారు. పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించే బాధ్యతలను సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ కు ముఖ్యమంత్రి అప్పగించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.

- Advertisement -