భారీ హాంగులతో భాగ్యనగరం..

214
REVIEW ON HYD
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో విశిష్థత కలిగిన నగరం భాగ్యనగరం. హైదరాబాద్‌ను నిజమైన గ్లోబల్‌సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కరించాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై సీఎం ఇటీవల సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బృహత్‌ ప్రణాళికలో మంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం చేస్తామని స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏ, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీ నిధులపైనే ఆధారపడకుండా ఇతర నిధులు కూడా సమకూరుస్తామని తెలిపారు. నగరాన్ని 3 యూనిట్లుగా విభజించి 3 నెలల్లో బృహత్‌ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. నగరంలోని వాతావరణం, సామరస్యపూరక జీవనం, మంచి పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తరలిరావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. హోటల్, నిర్మాణ రంగంలో కూడా ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. ప్రతీ ఏటా ఐదారు లక్షల మంది హైదరాబాద్‌కు వస్తున్నారు. అని అన్నారు.

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ప్రధాన నగరం అవతలికి తరలించాలి. మంచినీరు, డ్రైనేజి, ట్రాఫిక్‌, విద్యుత్‌ వంటి అంశాల్లో పరిస్థితిని అంచనా వేయాలి. విద్య, వైద్యం, క్రీడలు, సినిమా వంటి అంశాలకు ప్రత్యేక ప్రాంతాలు గుర్తించాలి. మాస్టర్‌ ప్లాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -