బాబుకు థ్యాంక్స్ చెప్పిన మోదీ.. ఎందుకంటే!

190
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడి పనితీరును తీవ్రంగా విమర్శించారు. ఎన్డీయే కూటమి నుంచి బాబు బయటకు వచ్చిన అనంతరం ప్రధాని మొదటిసారిగా ఇవాళ ఏపీ పర్యటనకు విచ్చేశారు. గుంటూరు వేదికగా చమురు నిల్వలకు సంబంధించి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నేడు శ్రీకారం చుట్టారు.

PM Narendra Modi

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో చంద్రబాబును మోదీ డైరెక్ట్‌గా టార్గెట్‌ చేశారు. అమరావతి నిర్మాణం అంటూ కూలిపోయిన తన పార్టీ నిర్మాణంలో బాబు ఉన్నారన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం మాని తన కొడుకును రాజకీయంగా నిలబెట్టే పనిలో పడ్డారని. మోదీ విమర్శించారు.

కానీ ఒక విషయంలో బాబుకు థ్యాంక్స్‌ చెప్పాలని మోదీ వ్యాఖ్యానించారు. ఎందుకంటార.. మాములుగా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు దిష్టి తగలకుండా పెద్దలు నల్ల చుక్క పెడతారని.. గుంటూరులో జరుగుతున్న బీజేపీ సభకు దిష్టి తగలకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, టీడీపీ నేతలు నల్ల బెలూన్లను ఎగురవేశారనీ, ఇందుకోసం ధన్యవాదాలని మోదీ అన్నారు. అనంతరం జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై అని నినాదాలతో సభను ముగించారు ప్రధాని.

- Advertisement -