CM KCR:అల్లూరి చరిత్రను భావితరాలకు అందించాలి

57
- Advertisement -

అల్లురి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకలు గచ్చిబౌలి స్టేడియంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకాగా సీఎం కేసీఆర్ పాల్గని ప్రసంగించారు. ఈ ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు చైతన్యాన్ని యావత్ దేశానికి చాటిచెప్పాయన్నారు. బ్రిటీష్ బంధనాల నుండి భారత మాత విముక్తికోసం పోరాడిన వీరుడు అల్లూరి అన్నారు.

అల్లూరి గొప్పతనాన్ని,చరిత్రను ముందు తరాలకు అందించాలన్నారు. అల్లూరిది గొప్ప వ్యక్తిత్వం అని అందుకే దైవాంస సంభూతుడు అని తెలిపానన్నారు.తెలుగుజాతిని నిలబెట్టిన గొప్ప వ్యక్తి అన్నారు. ఒక్క అల్లూరి సీతారామారాజు మరణిస్తే వందమంది ఉద్భవిస్తారని ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం అన్నారు.

Also Read:దెబ్బకి అలెర్ట్ అయిన కాంగ్రెస్..?

స్వయంగా మహాత్మాగాంధీనే అల్లూరిని కొనియాడారని గుర్తు చేశారు సీఎం కేసీఆర్.ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్రప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డిని అభినందించారు సీఎం కేసీఆర్.

Also Read:బీజేపీలో సంచలన మార్పులకు కారణం అదే.. !

- Advertisement -