ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి- కేసీఆర్‌

47
kcr cm

నేడు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాయకుల ఆలోచనలు, పనితీరు చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌ చాలా చైతన్యవంతమైన నగరమన్నారు. ఈ నగరానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేశామని గుర్తుచేశారు. తెలంగాణ వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలించలేరని అవహేళన చేశారని చెప్పారు. రాష్ట్రం అంధకారం అవుతుందని మాట్లాడారని పేర్కొన్నారు. నక్సలైట్లు చెలరేగుతారని కొందరు శాపాలు పెట్టారని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు.