హైదరాబాద్‌లో ఉన్న ప్రతీ బిడ్డా మా బిడ్డే- సీఎం కేసీఆర్‌

178
cm kcr
- Advertisement -

హైదరాబాద్ లో ఉన్న ప్రతీ బిడ్డా మా బిడ్డేనని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భావించి ఆచరించామని దానికి ఈ ఏడేళ్ల పాలనే సాక్షి అని కేసీఆర్ అన్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసునని కేసీఆర్ చెప్పారు. ఎల్బీస్టేడియంలో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. సభలో సీఎం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏదో అయిపోతుందని శాపనార్థాలు, భయాలు పెట్టారని అయితే వాటన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టిందని కేసీఆర్ చెప్పారు. కరెంట్ కోసం ఎంతో భయాందోళనలు సృష్టించారని అయితే, 24 గంటలు కరెంట్ నిరంతరం సరఫరా ఇచ్చామని ఇది తెలంగాణ మొదటి విజయమని కేసీఆర్ చెప్పారు.

హైదరాాబాద్ లో ప్రతీ అపార్ట్ మెంట్ వాసులకు కూడా 20వేల లీటర్ల వరకూ ఉచిత మంచినీటి సరఫరా కల్పిస్తున్నామని కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి ద్వారా భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా ప్రతీ గ్రామ పంచాయితీలో నర్సరీలు కల్పించి దేశంలోనే కొత్త అధ్యాయాన్ని సృష్టించామని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ పథకం చేపట్టినా ఎలాంటి బేధాలు, తారతమ్యాలు లేకుండా అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఈ కోవలో తీసుకున్నదే కంటివెలుగు పథకమని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కు కుల మత బేధాలు లేవని ఆయన చెప్పారు. కేసీఆర్ కిట్టు .. సూపర్ హిట్టు పథకమని, రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ప్రభుత్వం ఎక్కడైనా ఉందాని సీఎం ప్రశ్నించారు. బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలో ఎప్పుడన్నా కలగన్నామా అని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకూ 350 బస్తీ దావఖానాలు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు.

తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా 40 వేల కోట్ల పైచిలుకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ రంగంలో ఇప్పటికే తెలంగాణ రెండో స్థానంలోకి తీసుకొచ్చామని, త్వరలోనే ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు పనిచేసిందా నిద్రపోతుందా అనేది మీకు తెలియడంకోసమే ఈ సమీక్ష పెట్టినట్టు కేసీఆర్ చెప్పారు.

- Advertisement -