కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. స్వీయ నియంత్రణ పాటించాలని కరోనా కట్టడికి భౌతికదూరం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం…షుగర్,బీపీ,డయాలసిస్,క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వారికి కావాలసిని మందులు మూడు నెలల పాటు అందిస్తామన్నారు. వీరందరికి కోటి మాస్కులు అందజేస్తామని తెలిపారు సీఎం.
తెలంగాణలో ప్రస్తుతం 6 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయని చెప్పారు. 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయని , 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని వెల్లడించారు.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. 11 రోజుల్లో ఆరెంజ్ జోన్‌లో ఉన్న 18 జిల్లాలు గ్రీన్ జోన్‌లోకి రాబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 35 కంటైన్ మెంట్ జోన్‌లు ఉన్నాయని ఇందులో హైదరాబాద్‌లో 19 ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 12 కంటైన్ మెంట్ జోన్లు ఉండనున్నాయని చెప్పారు. తెలంగాణలో రోజురోజుకి కరోనా తగ్గుముఖం పడుతుందన్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉందని ఈ జిల్లాల్లో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 66 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. చనిపోయిన వారిలో 86 శాతం హైదరాబాద్ వారేనని చెప్పారు. మంగళవారం నమోదైన కేసుల్లో అన్ని హైదరాబాద్ పరిధిలోనివేనని చెప్పారు.ముంబైలాంటి దుస్ధితి మనకు రావొద్దంటే హైదరాబాద్ లోని ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలన్నారు సీఎం కేసీఆర్.