తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌: సీఎం కేసీఆర్

208
kcr
- Advertisement -

తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం…రాత్రిపూట కర్ఫ్యూ యదావిధిగా అమలు చేస్తామన్నారు. ఇంతకాలం కరోనాపై విజయం సాధించామని….మిగితా రోజులు కూడా సహకరించాలన్నారు.

70 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తే కరోనా కంట్రోల్‌లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారని గుర్తుచేశారు సీఎం. కేంద్రం దగ్గర కూడా కిట్లు లేవని..కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. 11 రోజుల్లో ఆరెంజ్ జోన్‌లో ఉన్న 18 జిల్లాలు గ్రీన్ జోన్‌లోకి రాబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 35 కంటైన్ మెంట్ జోన్‌లు ఉన్నాయని ఇందులో హైదరాబాద్‌లో 19 ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 12 కంటైన్ మెంట్ జోన్లు ఉండనున్నాయని చెప్పారు.

తెలంగాణలో రోజురోజుకి కరోనా తగ్గుముఖం పడుతుందన్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉందని ఈ జిల్లాల్లో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 66 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. చనిపోయిన వారిలో 86 శాతం హైదరాబాద్‌ వారేనని చెప్పారు. మంగళవారం నమోదైన కేసుల్లో అన్ని హైదరాబాద్ పరిధిలోనివేనని చెప్పారు.

- Advertisement -