సీపీఏం కేసీఆర్ తోనే…కేసీఆర్ స్కెచ్ అదిరిందిగా

282
Kcr
- Advertisement -

దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలోని పలువురు నాయకుల మద్దతు కోరుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకధాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే ఇటివలే కేరళ సీఎం పినరయి విజయన్ తో కూడా భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. ఫెడరల్ ప్రంట్ ఎర్పాటకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. కేసీఆర్ ఆలోచన విధానం చాలా బాగుందని చెప్పారు కేరళ సీఎం.

దేశంలో బీజేపీ , కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు కేసీఆర్. అయితే కేరళ సీఎం విజయన్‌తో సమావేశం కావడానికి ముందు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చర్చించారు.దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు విషయమై చర్చించారు. ఆయన కూడా ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గుచూపనున్నట్లు తెలుస్తుంది. ఇటివలే సీతారం ఏచూరి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈసారి కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశాలు లేవన్నారు. కాంగ్రెస్ కు కూడా సరైన మెజార్టీ రాకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం కానుందని తెలిపారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా వ్యవహరించనుందని తెలిపారు. దీంతో కమ్యూనిస్టులు కూడా కేసీఆర్ వ్యూహానికి జై కొట్టనున్నారు. దీంతో ఫెడరల్ ఫ్రంట్ లో కమ్యూనిస్టు పార్టీలు కూడా కీలకం కానున్నాయి.

- Advertisement -