కేటీఆర్ ను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పోచంపల్లి

149
Ktr Srinivas Reddy

టీఆర్ఎస్ పార్టీ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్దులు నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వరంగల్ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేశారు. నిన్న సాయంత్రం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేతుల మీదుగా భీ ఫారం ను అందుకున్నారు. ఈసందర్భంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్నతలు తెలపారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఈనెల 14న నామినేషన్లు గడువు ముగుస్తుండటంతో…17న ఉపసంహరించనున్నారు. మే 31 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 3న ఓట్లను లెక్కిస్తారు.