బుధవారం చలపతిరావు అంత్యక్రియలు..

89
- Advertisement -

సీనియర్ నటుడు చలపతిరావు ఇకలేరు. గుండెపోటుతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం అయన ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్ తన కుమారుడు రవి బాబు ఇంట్లో ఉంటున్నారు. ఆయన కుమార్తె అమెరికా నుండి వచ్చాకా అంత్యక్రియలు జరగనున్నాయి. బుధవారం రోజున మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇవాళ మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కయాన్ని తన కుమారుడు రవి బాబు ఇంట్లో నే అభిమానుల సందర్శన కోసం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3గంటల నుండి అయన పార్ధివ దేహాన్ని ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచుతామని ఆయన కుమారుడు రవిబాబు తెలిపారు.

తెలుగుతెరపై విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సేవలు అందించిన చలపతి రావు మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది. 1200 పైగా సినిమాల్లో నటించిన చలపతి రావు నిర్మాతగానూ పలు సినిమాలను నిర్మించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -