బిపిన్ రావత్ మృతి..సీఎం కేసీఆర్ సంతాపం

27
kcr

చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ శ్రీ బిపిన్ రావత్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి శ్రీ బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈరోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మరియు ఇతర సైనిక సిబ్బంది మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. బిపిన్ రావత్ తో పాటు సైనిక సిబ్బంది మరణించడం దేశాన్ని తీవ్ర షాక్ కి గురి చేసిందని, ఇది దేశానికి తీరనిలోటని మంత్రి కేటీఆర్ అన్నారు. బిపిన్ రావత్ కుటుంబంతో పాటు సైనిక సిబ్బంది కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.