బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 95 హైలైట్స్

74
siri

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 తెలుగు 95 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మానస్-కాజల్ మాట్లాడుకుంటూ షణ్ముఖ్.. సిరిని ప్రతి ఒక్క విషయంలో కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని కాజల్ చెప్పగా అవును ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నాడు…సిరి చాలా మారిపోయిందని తెలిపారు మానస్. షణ్ముఖ్ తప్పు చేసినా ఒప్పు చేసినా సిరి లైక్ చేస్తుంది.. కానీ ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది కదా అని చెప్పాడు మానస్.

ఇక మూడో సంఘటనలో భాగంగా.. జెస్సీ-శ్రీరామ్‌ల మధ్య జరిగిన గొడవని రీక్రియేట్ చేయాలని చెప్పారు. సన్నీ.. జెస్సీ విషయంలో సిరి-షణ్ముఖ్ ఎలా ప్రవర్తించారో చేసి చూపిస్తూ వీళ్లిద్దరూ యూటర్న్ తీసుకుని వెళ్లిపోయారని వాళ్లని ఇమిటేట్ చేస్తాడు.. దీంతో షన్నూ సీరియస్ అయ్యాడు. ఇలాంటివి చేయొద్దని నిన్ననే చెప్పాను. జరగలేనిది చేస్తే నాకు నచ్చదు అని అంటాడు షన్నూ.

కూల్‌గా ఉన్నా.. అనవసరంగా గొడవపడొద్దు.. సీరియస్ అవ్వొద్దు షణ్ముఖ్ అని సన్నీ చాలా కూల్‌గా చెప్పాడు.. నేనూ కూల్‌గానే ఉన్నాడు.. వెక్కిరిస్తే నేను ఒప్పుకోను అని చెప్పాడు షణ్ముఖ్.. నేనేం వెక్కిరించా యూటర్న్ తీసుకుని వెళ్లావ్ అని చెప్పాను.. బరాబర్ వెళ్లావ్.. అన్నీ నువ్ చెప్పిందే రైట్ అంటే హౌస్‌లో నడవదు.. నిన్న కూడా ఇలాగే చేశావ్.. నేను ఇమిటేట్ చేయట్లేదు.. రీ క్రియేషన్ అంటే ఇలాగే ఉంటుంది అంటూ సీరియస్ అయ్యాడు సన్నీ.

తర్వాత షణ్ముఖ్ అన్న మాటలతో సన్నీ రెచ్చిపోయాడు. మీరు చేయరు.. నేను చేస్తానంటే ఒప్పుకోరు.. ఇక్కడ బిగ్ బాస్ ఏది చెప్తే అది చేయాలి.. నాకు నచ్చదు అంటూ ఇక్కడ కుదరదు అని సీరియస్ అయ్యాడు సన్నీ. ఇక సిరి.. షణ్ముఖ్ దగ్గరకు వచ్చి అతన్ని కన్వెన్స్ చేయడానికి ట్రై చేసింది.. నువ్ డైవర్ట్ కాకు.. ఆ టాస్క్ చేయాలి కదా.. రా చేద్దాం అని అంటుంది. నేను చేయను.. నా వల్ల కాదని షణ్ముఖ్ తెలపగా ఇది అందరూ కలిసి ఆడాల్సిన గేమ్ కదా అని సిరి అంటే..ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇంతలో సన్నీ.. హమీదా గెటప్ వేసుకుని వచ్చి షన్నూకి ఎదురుగా నిలబడంతో.. షన్నూ సన్నీని అనలేక.. పక్కనే ఉన్న సిరిపై విరుచుకుపడతాడు. నీతోనే కాదు.. సన్నీతో కూడా మాట్లాడా.. సన్నీపై కూడా అరిచా అని సిరి అనడంతో.. అంటే సన్నీ నేను ఒకటేనా? అవతల వాడికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇవ్వడం లేదు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు షణ్ముఖ్. సన్నీ నువ్వు ఒక్కటే ఎలా అవుతారు షన్నూ.. ప్రతిదీ నెగిటివ్‌గా తీసుకుంటావ్.. సిరి అంటే నెగిటివ్.. నెగిటివ్ అంటే సిరి అన్నట్టుగా మాట్లాడతావ్ అనడంతో షణ్ముఖ్ పిచ్చెక్కినట్టు అరుస్తాడు. తర్వాత సిరి ఎంత ప్రాధేయపడ్డా షణ్ముఖ్ తన పిచ్చి ఆపలేదు.

ఇక కొంచెం సేపటి తర్వాత దోసెలు వేసుకొచ్చి.. సిరికి క్షమాపణ చెప్తాడు.. దీంతో సిరి నవ్వుతూ.. షణ్ముఖ్‌కి హగ్ ఇస్తుంది. మా మమ్మీ ఏమీ అనదు అనడంతో సిరిని సోఫాలో పెట్టుకుని ఎప్పటిలాగే తెగ నలిపేస్తాడు షణ్ముఖ్.