దిలీప్ కుమార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

125
KCR

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నటుడుగా దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి దిలీప్ కుమార్ చేసిన సుధీర్ఘ సాంస్కృతిక సేవను సిఎం గుర్తు చేసుకున్నారు. దిలీప్ కుమార్ మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.