లింగు స్వామితో రామ్ ‘రాపో’..!

114
ram

ఇస్మార్ట్ శంకర్‌తో ఉస్తాద్ గా మారిపోయాడు హీరో రామ్‌. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో సినిమాను అనౌన్స్‌ చేశారు.

జులై 12 నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమా హీరో రామ్ కెరీర్‌లో 19వ మూవీ. రామ్‌ని డిఫరెంట్ షేడ్‌లో ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తుంది.