దివికేగిన దిగ్గజ నటుడు.. నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… కైకాల సత్యానారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కైకాల కుటుంబసభ్యులను పరామర్శించారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు.తెలుగు చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ, తమ వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఏ పాత్ర ఇచ్చిన కూడా సజీవంగా జీవిస్తూ నటించి అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు.
కైకాల ఎంపీగా పని చేసిన కాలంతో ఆయనతో కొన్ని అనుభావాలు కూడా పంచుకున్నాం. కొంతకాలం మేమంతా కలిసి కూడా పని చేశాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడిని కోల్పోవడం చాలా బాధాకరం. సత్యనారాయణ లోటును ఎవరూ కూడా పూడ్చలేరని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన పోషించిన పాత్రలు అద్భుతమంటూ సీఎం కేసీఆర్ కొనియాడారు. రేపు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరిగే కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని, ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.