ఎమ్మెల్యే కొనేరు కొనప్పపై సీఎం కేసీఆర్ ప్రశంసలు…

250
kcr
- Advertisement -

ఎమ్మెల్యే కొనేరు కొనప్పపై ప్రశంసలు గుప్పించారు సీఎం కేసీఆర్. కోనేరు చారిటబుల్ ట్రస్టు ద్వారా జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు.

బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్న కొనేరు కొనప్ప కుటుంబ సభ్యులను అభినందించారు. ప్రతి రోజు 1000 మందికి అన్నదానం చేయడం, స్కూళ్లకు టీవీలు అందచేయడం, టీచర్ – పోలీస్‌, మిలటరీ, ఫారెస్టు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు

ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, రక్తహీనత ఉన్న మహిళలకు పోషకాహారం అందించడం, ఎస్సీ, ఎస్టీలకు సామూహిక వివాహాలు జరిపించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీఎం అభినందించారు.

- Advertisement -