- Advertisement -
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాపై విచారణ వేగవంతం కాగా తాజాగా ఆయన కుమారుడు నితిన్ భూ కబ్జాపై విచారణకు ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ కుమారుడు తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి నితిన్ రెడ్డి కబ్జాలపై సీఎంకు ఫిర్యాదు అందించారు.
దీంతో స్పందించిన సీఎం కేసీఆర్… తక్షణమే విచారణ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అవినీతి నిరోదకశాఖ, విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు.
ఇప్పటికే ఈటల ఆక్రమించిన అసైన్డ్ భూములపై ఐఎఏస్ అధికారుల కమిటీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది.
- Advertisement -