శ్రీశైలం విద్యుత్ ప్రమాదఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి

129
cm kcr
- Advertisement -

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్ర ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్ధితిని అడిగి తెలుసుకుంటున్నారు. సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడిన సీఎం సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. విద్యుత్ ప్రమాద ఘటనతో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేయగా మంత్రి జగదీష్ రెడ్డి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

పవర్ ప్లాంట్ లోపల డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్‌తో పాటు ఆమ్రాన్‌ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ లోపలే ఉండిపోయారు. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

- Advertisement -