పరీక్షలు నిర్వహించి తీరుతాం: ఏపీ ప్రభుత్వం

32
ssc

ఏపీలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. పరిక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని….విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు రద్దు కావాలని కోరుకోవడం లేదన్నారు.

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సురేష్‌…పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉందని తెలిపారు.