తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ..

35

త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తో స‌మావేశమైయ్యారు. ముందుగా స్టాలిన్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ కుటుంబసభ్యులను సాదరంగా ఆహ్వానించారు స్టాలిన్‌. అనంతరం సీఎం కేసీఆర్ ఆయనతో సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు. కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర కూటమి ఏర్పాటుపై చ‌ర్చించారు. యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు సీఎం కేసీఆర్‌ వెళ్ళారు. కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌, కుటుంబ‌స‌భ్యులు ఉన్నారు.