‘ఛలో’ డైరెక్టర్‌తో చిరు 156..

25
Chiranjeevi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో కుర్ర హీరోలకు షాకిస్తున్నాడు. ఇప్పటికే 4 చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న చిరు.. తాజాగా 156వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండడం విశేషం. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాక్టర్ మాధవి రాజు ఈ చిత్రానికి సహ నిర్మాత.

‘ఛలో’ చిత్రంతో హిట్ అందుకున్న వెంకీ కుడుముల, ఆ తర్వాత ‘భీష్మ’తో కమర్షియల్ సినిమాలు తీసే సత్తా ఉందని చాటుకున్నాడు. తాజాగా మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. త్వరలోనే తారాగణం వివరాలు ప్రకటించనున్నారు.