ఆడికన్నా గట్టిగా అరవగలను ఎవడాడు అంటున్న ‘రానా’..

121
- Advertisement -

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి ఈరోజు గ్లింప్స్‌ విడుదల చేశారు చిత్ర బృందం. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా ఆయన పోషిస్తున్న డేనియల్ శేఖర్ పాత్రకు సంబంధించిన వీడియో వదిలారు. ‘భీమ్లా నాయక్’ పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ ప్రచార చిత్రాన్ని పరికిస్తే….

“వాడు అరిస్తే భయపడతావా ఆడికన్నా గట్టిగా అరవగలను ఎవడాడు…. దీనమ్మ దిగొచ్చాడా… ఆఫ్ట్రాల్ ఎస్ఐ సస్పెండెడ్….” అంటూ డేనియల్ శేఖర్ పాత్రధారి రానా ఆవేశంగా ఎవరితోనో చిత్ర కథానుసారం సంభాషించటాన్ని ఇందులో చూడవచ్చు. ఈ సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర.

- Advertisement -