- Advertisement -
హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. నాలుగు సంఘాల ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకాగా ఉద్యోగుల సమస్యలు,పీఆర్సీ అమలుపై ఉద్యోగులుకు ఉన్న అభ్యంతరాలపై చర్చించనున్నారు. ఐదేళ్లకోసారి ఇచ్చే పీఆర్సీని గతంలో రెగ్యులర్ ప్రభుత్వోద్యోగులకు మాత్రమే ప్రకటించే వారు. కాని కేసీఆర్ మాత్రం అందరూ ఉద్యోగులు ఇస్తున్నారు. ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి 9 లక్షల 36 వేల 976 మంది వేతనాలు పెరగనున్నాయి.
పీఆర్‌సీ, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఇతర సమస్యలపై ఉద్యోగులతో చర్చించనున్నారు సీఎం. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -