వృక్ష వేదం అద్భుతం- జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు

38
CMD Prabhakar Rao

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకువచ్చిన వృక్ష వేదం పుస్తకాన్ని జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలను నాటి వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం చేస్తున్న కార్యక్రమం ప్రజలల్లో అవగాహన పెంచడం జరుగుతుంది అని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రకృతి చిత్రాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన వృక్ష వేదం పుస్తకం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.