టెన్నిస్‌ క్రీడాకారుల హబ్‌గా హైదరాబాద్‌: శ్రీనివాస్‌గౌడ్

153
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో టెన్నిస్ స్టేడియం ను రాష్ట్ర పరిశ్రమల, IT శాఖ ల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి లతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాకారుల హబ్ గా హైదరాబాద్ సిటీ ని తీర్చిదిద్దుతున్నామన్నారు.

తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కలసి రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు టెన్నిస్ క్రీడాకారులకు ఆధునిక, అత్యున్నత శిక్షణ ను ఇవ్వడానికి అసోసియేషన్ తరుపున టెన్నిస్ అభివృద్ధి కి తమ వంతు సహకారం అందిస్తామని అందుకు లాల్ బహదూర్ స్టేడియంలో ని టెన్నీస్ కాంప్లెక్స్ లోని మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవటానికి SATS నుండి అనుమతి ఇవ్వాలని తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేశారు.

టెన్నిస్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ పై క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారన్నారు. పురపాలక, పరిశ్రమల, IT శాఖ మంత్రి శ్రీ KT రామారావు గారి సూచనల మేరకు త్వరలో కేబినేట్ సబ్ కమిటీ సమావేశంలో క్రీడల అభివృద్ధికి కీలక నిర్ణయాలను తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో SATS అధికారులు సుజాత, వెంకయ్య, నర్సయ్య, డా. హరికృష్ణ, చంద్రావతి లు పాల్గొన్నారు.

- Advertisement -