- Advertisement -
తమిళనాడు పర్యటనలో భాగంగా డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. చెన్నైలోని ఆళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసంలో సమావేశమయ్యారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్,ఎంపీ వినోద్ ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ని సాదరంగా ఆహ్వానించారు స్టాలిన్. డీఎంకే నేతలు దురై మురుగన్, టీఆర్ బాలు..కేసీఆర్‌తో భేటీలో పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా స్టాలిన్, కేసీఆర్ భేటీలో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 23 తరువాత కేంద్రంలో ఏర్పాటుకాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని.. ప్రాంతీయపార్టీల వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని స్టాలిన్‌కు కేసీఆర్ వివరించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 21న జరిగే అఖిలపక్ష సమావేశం గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -