‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ డేట్‌ ఫిక్స్‌..

240
Ismart Shankar

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.రామ్ సరసన కథానాయికలుగా నిధి అగర్వాల్ – నభా నటేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్టీ ఇటీవలే పూర్తయింది. రామ్, పూరి కాంబినేషన్ అనగానే సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

Ismart Shankar

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్‌ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు చిత్ర బృందం. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఫస్టు టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా పూరి ఎంతో కష్టపడుతున్నాట్లు సమాచారం. ఇటు హీరో హీరోయిన్లు .. అటు దర్శకనిర్మాతగా పూరి ఈ సినిమా సక్సెస్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నాడు ఈ డాషింగ్‌ డైరెక్టర్‌. ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.