బ్రేకింగ్..తెలంగాణలో ప్రతిపక్షంగా వైసీపీ..!

450
kcr jagan
- Advertisement -

కేసీఆర్ ఏది చేసినా సంచలనమే..తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే ఎలా..? ఇది ఎలా ప్రజాస్వామ్య బద్ధం అంటూ ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ తన ప్రయత్నాల్ని మాత్రం ఆపలేదు.. కాంగ్రెస్ ను పాతిపెట్టే వ్యూహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు..ఇవాలో రేపో టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనం పూర్తయితే ఇక కాంగ్రెస్ నామమాత్రం అవుతుంది.. ఇలాంటి తరుణంలో అందరూ అనుకున్నది ఏంటయ్యా అంటే ఎంఐఎమ్ ను నామ మాత్రపు ప్రతిపక్షంగా కేసీఆర్ ప్రొజెక్ట్ చేస్తారు అని..కానీ అసలు వ్యూహం వేరే ఉంది..

ప్రస్తుతం కాంగ్రెస్ టీడీపీల నుంచి టీఆర్ఎస్ లోకి వలస వస్తున్న ఎమ్మెల్యేలందరి చేతా కేసీఆర్ ఆరు నెలల తర్వాత నిజంగానే రాజీనామా చేయించనున్నారు…అలా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరి చేతా వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేయిస్తారు..సో ఆంధ్రాలో అధికార పక్షంలో ఉండే వైఎస్సార్సీపీ పార్టీని తెలంగాణలోకి దింపి ఇక్కడ ప్రతిపక్షంగా మారుస్తారు.. అంటే ఒక విధంగా అది మరో పక్షమే అయినా కేసీఆర్ కు స్వపక్షంగానే ఉంటుంది..

కేంద్ర రాజీకీయాల్లో కేసీఆర్, జగన్ అతి త్వరలో కీలకపాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో ఆ మైత్రిని ఇక్కడ ఉపయోగించి ఒకేసారి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను భూస్థాపితం చేయడం కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు..రెడ్ల ప్రాభల్యం అధికంగా ఉండే తెలంగాణలో వైఎస్సార్సీపీని ఈజీగానే ఓన్ చేసుకుంటారని భావిస్తున్నారు.. ఇదే జరిగితే నిజంగానే మిగతా పార్టీలు తెలంగాణలో చరిత్రలో కలిసిపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

అయితే ఎప్పటిలాగే ఇదంతా జరగాలీ అంటే ఈ నెల 23వ తేదీ దాకా ఆగాల్సిందే.. ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. కేసీఆర్ ఈ వ్యూహానికి పదును పెడతారు..ఒక వేళ యూపీఏతో కలిసి వెళ్లే పక్షంలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడం ఆపినా.. ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఉండటం కేసీఆర్ కు కంఫర్ట్…
ఈ వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించనుంది..చూద్దాం ఏం జరుగుతుందో…

- Advertisement -