నేటి నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం షూరూ.. షెడ్యూల్ ఇదే

278
KCR
- Advertisement -

తెలంగాణలో లోక్ సభ పోలింగ్‌కు రెండు వారాలే ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడెక్కుతోంది. పలు పార్టీల కీలక నేతలతో సభలు,రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్టీ ప్రచారంతో పరుగులు పెడుతుంది. లోకసభ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్‌‌ఎస్‌‌ ఇప్పటికే ఒక అడుగు ముందంజలో ఉంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది.

16 లోక్‌సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. ఈ నెల 29 నుంచి ఆరు రోజుల పాటు మరో 11 నియోజకవర్గాల్లో ప్రచార సభలకు ఇటీవలే షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

CM KCR

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు హైదరబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల  లోక్‌సభ సెగ్మెంట్ల ఉమ్మడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

- Advertisement -