కే‌సి‌ఆర్ నాయకత్వమే.. తెలంగాణ బలం !

42
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధనలో కే‌సి‌ఆర్ చూపిన పోరాట పటిమ అనితరసాధ్యమైనది అనే సంగతి అందరికీ తెలిసిందే. దశాబ్దాల కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రజల్ల గొంతుకగా మరి, ఉక్కు సంకల్పంతో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో కోట్లాడి.. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కే‌సి‌ఆర్ పాత్ర ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా పాలనలో వైవిధ్యం చూపుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కే‌సి‌ఆర్ కే చెందుతుంది. ఒకప్పుడు కరెంటు కోటలతో విలవిలాడిన తెలంగాణ ప్రాంతం.. ఇప్పుడు విద్యుత్ సరఫరాలో దేశంలోనే తెలంగాణ నెంబర్ ఒన్ గా నిలిచింది.

Also Read:తెలంగాణతో పాటే.. ఏపీ ఎలక్షన్స్ ?

ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కానీ 24 గంటల విద్యుత్ ఒక్క తెలంగాణలో అమలౌతుందంటే.. దానికి కే‌సి‌ఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే కారణం అని చెప్పక తప్పదు. ఇక వివిధ వివిద రంగాల్లోనూ తెలంగాణ సాధించిన పురోగతి కే‌సి‌ఆర్ విజనరీకి అద్దం పడుతోంది. ఇక రాష్ట్రం ఏర్పడి దశాబ్దికాలం పూర్తి కావడంతో కే‌సి‌ఆర్ పోరాట పటిమపై, ఆయన పాలన దక్షతపై అన్నీ వైపులా నుంచి ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కే‌సి‌ఆర్ పై ప్రశంశలు కురిపించారు. కే‌సి‌ఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతుందని, ఈ పదేళ్ళ కాలంలో తెలంగాణ ఆదాయం పెరిగిందని రఘురామ హర్షం వ్యక్తం చేశారు. కే‌సి‌ఆర్ పాలనలో ప్రస్తుతం తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇతర రాష్ట్రాల నేతలు కూడా కే‌సి‌ఆర్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటులోనూ.. ఆ తరువాత రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోవడంలోనూ కే‌సి‌ఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్ర బలం అని అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం.

Also Read:‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో హరీష్ రావు

- Advertisement -