ఇప్పుడు బాలయ్య వంతు.. గెట్ రెడీ!

36
- Advertisement -

గత కొన్ని రోజులుగా సెట్స్ పై ఉన్న బడా హీరోల మూవీ టైటిల్స్ అధికారిక ప్రకటన జరుగుతోంది. ఇప్పటివరకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి వారు వారి కొత్త సినిమాల టైటిల్స్ రివిల్ చేశారు. ఇక ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణ వంతు వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 10 న బాలయ్య పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఆయన మూవీస్ నుంచి కొత్త అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ” NBK 108 ” మూవీ చేస్తున్నాడు.

ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ మూవీకి సంబంధించి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ” బ్రో ఐ డోంట్ కేర్ ” , భగవత్ కేసరి ” వంటి టైటిల్స్ వినిపించాయి. అయితే ఏ టైటిల్ ను కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు చిత్ర యూనిట్. జూన్ 10 బాలయ్య పుట్టిన రోజు కావడంతో ఆరోజు ఈ మూవీ టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ” భగవత్ కేసరి ” టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్.

Also Read:‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో హరీష్ రావు

అలాగే అదే రోజునే బోయపాటి తో చేయబోయే తదుపరి మూవీ ప్రకటించే అవకాశం ఉందట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్ బాస్టర్ మూవీస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నాలుగో సారి కూడా ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉండడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మొత్తానికి ఈ జూన్ 10న బాలయ్య అభిమానులతో సోషల్ మీడియా హోరెత్తనుందని చెప్పవచ్చు.

Also Read:తెలంగాణతో పాటే.. ఏపీ ఎలక్షన్స్ ?

- Advertisement -