సీఎం కేసీఆర్ స్పూర్తితోనే గ్రీన్ ఛాలెంజ్‌:ఎంపీ సంతోష్

548
mp santhosh kumar
- Advertisement -

నేలంతా పచ్చగా ఉంటే.. మనుషులంతా చల్లగా ఉంటారనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాటలతో స్పూర్తిపొంది గ్రీన్ ఛాలెంజ్‌ని ప్రారంభించానని తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్‌. గత ఏడాది ప్రారంభించిన గ్రీన్ ఛాలేంజ్ దిన దిన ప్రవర్ధమానంగా ప్రజ్వరిల్లుతూ.. కోట్లాది హృదయాలను కదిలించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సమాజం బాగుండాలని తపనపడి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.

తాను ఒక మొక్కను నాటి మరో ముగ్గురు మిత్రులు నాటలని ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ప్రయత్నం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ముందుకు పోవడం మనందరి విజయం. ఈ సంకల్పం దిగ్విజయంగా కొనసాగాలని మంచి మనసుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు మిత్రులందరు కదలిరావడం నా హృదయాన్ని కదిలించింది. ఇప్పటి వరకు కలంతో జనాన్ని కదిలించిన జర్నలిస్టు మిత్రులు.. ఇప్పుడు మొక్కలు నాటి ప్రజలందరికి చైతన్యం కలిగించడం చారిత్రాత్మకం అన్నారు.

ఈ కార్యక్రమం ముందుకు సాగాలని యావత్ తెలంగాణ జర్నలిస్ట్ లోకాన్ని కదిలించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మిత్రులకు, సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణగారికి, చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్యే (ఆందోల్) గారికి, సురేష్ (టీన్యూస్) గారికి, నారాయణ రెడ్డి (టీన్యూస్), పాండు (వీ6)గారికి, యోగి విజయ్ గోపాల్, సీతారామరాజు ఐ&పీఆర్ సెక్రటరీ, సతీష్ (మిక్ టీవీ) నవీన్ (ఏబీఎన్) ఇతర సీనియర్ జర్నలిస్టులకు, అన్నీ జిల్లాల టీజేఎఫ్ కార్యవర్గానికి మరియు ఇతర జర్నలిస్టులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

cm kcr inspires me says mp santhosh kumar…cm kcr inspires me says mp santhosh kumar

- Advertisement -