సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌..

211
cm kcr
- Advertisement -

కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు.

ప్రధాన గేట్ తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. డిజైన్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, అధికారులు తదితరులున్నారు.

- Advertisement -