గుస్సాడీ కనకరాజుకు అభినందలు: ఎమ్మెల్సీ కవిత

40
MLC Kavitha

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వ్య‌క్తుల‌పై ప‌లువురు నేత‌లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తెలంగాణ కుమ‌రం భీం జిల్లాకు చెందిన గుస్సాడీ డ్యాన్స్‌‌ మాస్టర్‌‌ కనకరాజు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీ నృత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి, తన ఇంటి పేరునే గుస్సాడీగా మార్చుకుని, పద్మ శ్రీ అవార్డు గెలుచుకున్న కుమురం భీం జిల్లాకు చెందిన శ్రీ గుస్సాడీ కనకరాజుకు అభినందనలు అని పేర్కొన్నారు. గుస్సాడీ నృత్యానికి గుర్తింపు తెచ్చినందుకు గాను కళా‌‌ విభాగంలో ఆయనను ఈ అవార్డుకు కేంద్రం ఎంపిక చేయ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు.