మోడ్రన్‌ మార్కెట్‌ యార్డును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

85
kcr cm
- Advertisement -

మఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని సర్ధాపూర్‌ గ్రామంలో మార్కెట్‌ యార్డును ప్రారంభించారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కేటీఆర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మార్కెట్‌లో రైతులకు రైతులకు కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో రైతుల కోసం నిర్మించిన మార్కెట్‌ యార్డు జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం సకల సదుపాయాలు, అత్యాధునిక హంగులతో 20 ఎకరాల్లో రూ.20కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టింది. సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ సముదాయం, గిడ్డంగులు ఇక్కడ ఉండగా.. రాష్ట్రంలోనే ఇదే తొలి మోడ్రన్‌ మార్కెట్‌ యార్డుగా నిలిచింది.

సీఎం ఈరోజు సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్ల చేరుకున్న కేసీఆర్ ముందుగా తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద 27 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ టు పద్ధతిలో రూ. 83.37 కోట్ల వ్యయంతో నిర్మించిన 1320 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గృహప్రవేశం చేయించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -