అమీర్ ఖాన్ విడాకులపై ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్‌..

261
rgv
- Advertisement -

బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విడాకుల వార్త అందరినీ షాక్‌ గురిచేసిన సంగతి తెలిసిందే. ఆయన 15ఏళ్ల సంసారజీవనం తర్వాత తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకుని విడిపోతున్నారని తెలియగానే వారిపై చాలా మంది విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించారు.

ఆమిర్ ఖాన్ దంప‌తులు ఎలాంటి బాధ లేకుండా విడిపోతున్నార‌ని, వారికి లేని బాధ ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ల‌కి ఎందుక‌ని ఆయ‌న నిల‌దీశారు. సామాజిక మాధ్య‌మాల్లో వాళ్లను ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావ్ విడిపోవ‌డంతో భవిష్యత్తులో వారు వ్యక్తిగత జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నానని ఆయ‌న చెప్పారు.

ఎన్న‌డూలేని విధంగా ఇక‌పై వారి జీవితాలు మరింత బాగుండాల‌ని ఆశిస్తున్నాన‌ని రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పారు. త‌న‌ దృష్టిలో వివాహం చేసుకోవ‌డం కంటే విడాకులు తీసుకున్న‌ప్పుడే అధికంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఆయ‌న అన్నారు. ఎందుకంటే వివాహం అనేది మూర్ఖత్వమ‌ని, అది అజ్ఞానంతో ముడిపడి ఉంద‌ని అన్నారు. విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో ముడిప‌డి ఉన్న విష‌య‌మ‌ని చెప్పారు.

కాగా, మరోవైపు అమీర్‌ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌ను పెళ్లాడేందుకే ఇలా చేస్తున్నాడని తన సినిమాలు ఇన్నాళ్లు చూసినందుకు షేమ్ ఫీలవుతున్నామని ట్రోలర్స్ చెలరేగారు. తన సినిమాలతో యువతలో స్ఫూర్తి నింపిన అమీర్ ఖాన్ ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు చాలా మంది అభిమానులు.

- Advertisement -