ఐడీటీఆర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

215
KCR inaugurating IDTR
- Advertisement -

ఆదివారం సీఎం కేసీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటించారు. ఈపర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐడీటీఆర్‌)ను సీఎం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం భవనంలో తరగతి గదులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకొని 20 ఎకరాల్లో రూ.20కోట్లతో ఐడీటీఆర్‌ను ఏర్పాటు చేయించారు. భవన నిర్మాణాలు పూర్తి కాగా, తేలిక పాటి వాహనాలతో పాటు భారీ వాహనాలు నడిపేలా అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. డ్రైవర్‌కు శిక్షణతో పాటు రీఫ్రెషింగ్‌ కోర్సులు కూడా ఉన్నాయి.

ఆధునిక తరగతి గదులు, ఆఫీసర్‌ గదులు, వర్క్‌షాపులు, రోడ్లు, జీబ్రా క్రాసింగ్‌లు, క్యాంటిన్లు నిర్మించారు. ప్రభుత్వం, అశోక్‌ లేలాండ్‌ కంపెనీ సంయుక్తంగా నిర్వహించే కళాశాలలో ఏటా రెండువేల మందికి డ్రైవింగ్‌లో నెలకు 400 మంది వరకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఐటీడీఆర్‌ దక్షిణ భారతదేశంలో నాలుగోదిగా.. తెలంగాణ రాష్ట్రంలో తొలి కేంద్రం. అన్ని జిల్లాలకు చెందిన వారు ఇక్క డ శిక్షణ పొందవచ్చు. శిక్షణ పొందిన వారికి పెద్ద పెద్ద కంపెనీలో హెవీ వెహికల్స్‌ నడిపే విధంగా డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఇతర దేశాల్లో కూడా డ్రైవింగ్‌ కోసం ఉపాధికి వెళ్లేవారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.

- Advertisement -